ప్రకాశం: అర్ధవీడు మండలానికి చెందిన పదవ తరగతి విద్యార్థి కర్ణ అనారోగ్యంతో మృతి చెందడంతో, ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ఆ విద్యార్థి కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. శనివారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి టిడిపి కార్యాలయంలో విద్యార్థి కుటుంబానికి రూ. 3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. దీంతో విద్యార్థిని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.