JN: పాలకుర్తి మండలం వావిలాల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లక్ష్మీనారాయణ నాలుగో వార్డ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ సందర్భంగా ఆయన ప్రచారం చేస్తూ తనను గెలిపిస్తే అర్ధరాత్రి అయినా సరే అత్యవసర సమయంలో ఆసుపత్రులకు తన అంబులెన్స్‌ను ఆక్సిజన్‌తో సహా ఐదు సంవత్సరాలు ఉచితంగా కోరిన ఆసుపత్రికి తరలిస్తానని హామీ ఇస్తున్నారు. కాగా, హామితో గ్రామంలో ఆసక్తి నెలకొంది.