MDK: మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో శనివారం రాత్రి కృష్ణకు చెందిన గేదెకు రెండు తలలతో వింత దొడ్డే (దూడ) జన్మించింది. కుటుంబ సభ్యులు, పశు పశు వైద్యులు రెండు గంటల పాటు శ్రమించి దూడను బయటికి తీశారు. అయితే జన్మించిన తరువాత ఆ దూడ మృతి చెందినట్లు పశు వైద్యులు తెలిపారు. రెండు తలల దూడను పలువురు విచ్చేసి వింతగా చూస్తున్నారు.