MBNR: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి గ్రామాల్లో మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై శేఖర్ రెడ్డి హెచ్చరించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో తీవ్ర తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు. వాహనాల్లో మద్యం పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.