WGL: నల్లబెల్లి మండలం ఆసరవెల్లిలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బానోతు వీరన్న ఓటర్లలో నమ్మకం కలిగించేందుకు స్టాంప్ పేపర్ పై ఒప్పందం రాసి ఇస్తున్నారు. “నన్ను గెలిపిస్తే గ్రామానికి అవసరమైన రోడ్డు నిర్మాణం చేస్తాను” అని వాగ్దానం చేస్తూ ఒప్పంద పత్రం రాసి ప్రజలకు అందజేస్తున్నారు. ఈ వినూత్న ప్రచారం గ్రామంలో ఆసక్తి రేకెత్తిస్తోంది.