గోవా అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 25కు పెరిగింది. సిలిండర్ పేలిన సెకన్లలోనే మంటలు వ్యాపించడం, ఎగ్జిట్ పాయింట్ చిన్నగా ఉండటంతోనే ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో 22 మంది ఊపిరాడక చనిపోగా ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఈ నేపథ్యంలో అధికారులు 2 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు.