ATP: ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు డా.పోతుల నాగరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ను ఆదివారం అనంతపురంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి వెంటనే ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు.