KDP: మాజీ సీఎం YSR సోదరుడు YS రాజారెడ్డి వర్ధంతి ఆదివారం ఘనంగా నిర్వహించారు. YSR సమాధుల తోటలో YS జార్జి రెడ్డి సమాధితో పాటు రాజారెడ్డి, వివేకానంద రెడ్డి సమాధుల వద్ద పూలమాలలు పెట్టి వైఎస్ విజయమ్మ, జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ నివాళులర్పించారు. అనంతరం పులివెందులలో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.