JN: స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గంగుల మహేశ్వర్ రెడ్డిని గెలిపించాని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. గ్రామంలో ఆదివారం ఉదయం కడియం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామాల అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తున్నదని కడియం తెలిపారు.