HNK: పట్టణ కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ మెస్‌లో ఆదివారం ఉదయం విద్యార్థులకు అందించిన టిఫిన్ ఉప్మాలో పురుగులు కనిపించాయి. దీంతో విద్యార్థులు సిబ్బందిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా స్పందించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాధ్యులను విధుల నుంచి తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కలెక్టర్ స్పందించాలని కోరారు.