KDP: కొండాపురానికి చెందిన ఆర్మీ మాజీ ఉద్యోగి షేక్ హాజీవలి రికార్డు స్థాయిలో రక్తదానం చేసి ప్రాణ రక్షకుడిగా నిలిచారు. కొండాపురంలో శనివారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 91 వ సారి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కొండాపురం MRO గుర్రప్ప ఆయనను అభినందించారు. ఏడాదికి రెండుసార్లు కొండాపురంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తుంటానని ఆయన పేర్కొన్నారు.