NLG: చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో ఒకటవ వార్డులో నెలకొన్న మేజర్ సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గోలి అలేఖ్య మహేష్ ప్రజలకు హామీ ఇచ్చారు. తాగునీటి సమస్య పరిష్కారానికి వాటర్ ప్లాంట్ ఏర్పాటు, బీసీ కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. ఈ గ్రామంలో ఐదుగురు సర్పంచు అభ్యర్థులు పోటీలో నిలిచారు.