KMM: విజయవాడలో జరిగిన అంతరాష్ట్ర సాంస్కృతిక కార్యక్రమంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. సింగరేణి ఏకలవ్య మోడల్ స్కూల్ విద్యార్థిని హర్షిత జానపద నృత్యంలో జాతీయ స్థాయిలో మొదటి బహుమతి సాధించింది. ఆమె తల్లిదండ్రులు బానోతు స్వామి- లీలావతి, సంగీత ఉపాధ్యాయురాలు సుజాత ప్రేరణతో హర్షిత అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. పాఠశాల ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు.