MBNR: బాలానగర్ మండలంలోని 37 గ్రామ పంచాయతీలకు మూడో విడతలో ఈ నెల 17న ఎన్నికలు జరగనున్నాయి. నిన్నటి వరకు దాఖలైన నామినేషన్ పత్రాలను అధికారులు పరిశీలించారు. మండలంలో సర్పంచ్ పదవికి 170 నామినేషన్లు, వార్డు సభ్యులకు 739 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు.