TG: మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవకాశం కోసం పార్టీ మారావని, తనను మోసం చేశావని మండిపడ్డారు. ఓటేసిన ప్రజల దగ్గరకు వచ్చే టైమ్ తుమ్మలకు లేదన్నారు. కొడుకును పెట్టుకొని పరిపాలన చేస్తున్నారని, కొందరు అవకాశవాదుల్ని చేర్చుకొని తమ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపించారు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్లు ఏమీ చేయడం లేదన్నారు.