W.G: నరసాపురం సబ్ డివిజన్ పరిధిలో ఈ నెల 12 వరకూ సెక్షన్ 30 అమలులో ఉంటుందని నరసాపురం డీఎస్పీ డా. జి. శ్రీవేద తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు నిర్వహించకూడదన్నారు. జరపాలనుకుంటే ముందుగా సబ్ డివిజన్ పోలీస్ అధికారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. జనాన్ని పోగుచేసి సమావేశాలు, లౌడ్ స్పీకర్లు, డీజేలు నిషేధమన్నారు.