ప్రకాశం: మహిళ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో దుష్ప్రచారం చేస్తున్న ప్రకాశం జిల్లా వాసిని గుంటూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ వెంకటేశ్వర్లు వివరాల మేరకు గుంటూరుకు చెందిన మహిళ ఫోటోలను గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి చెందిన మధుసూదన్ రెడ్డి మార్ఫింగ్ చేసి SMలో పోస్ట్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో నిందుతుడిని పోలీసులు అరెస్టు చేశారు.