KDP: ప్రొద్దుటూరు మండల పరిధిలోని ఈశ్వర్ రెడ్డి నగరకు చెందిన వెంకటేశ్వర్లు(21) అనే యువకుడు శనివారం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. యువకుడు ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లో నుంచి వెళ్లి ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు నమోదు చేశామన్నారు.