KDP: ఖాజీపేట మండల వ్యాప్తంగా ఉన్న విద్యుత్ వినియోగదారులు అదనపు లోడు క్రమబద్ధీకరణ చేసుకోవడానికి ఈనెల 30వ తేదీచివరి గడువని, ప్రభుత్వం యాబై శాతం రాయితీ కల్పిస్తోందని మండల విద్యుత్ ఇంజినీరు నాగరాజు తెలిపారు. ఈ అవకాశం కేవలం ఇంటి యజమానులకు మాత్రమే అన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ అవకాశం ఉందన్నారు. విద్యుత్ ఇంజినీరింగ్ కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు.