సత్యసాయి: నేడు జూడో జూనియర్ క్యాడెట్ జట్ల బాల, బాలికల ఎంపిక జరగనుంది. రాష్ట్రస్థాయి జూడో జూనియర్స్ క్యాడెట్ విభాగ పోటీల కోసం జిల్లా జట్ల ఎంపికను ఈరోజు ధర్మవరం సమీపంలోని చిగిచెర్ల ఉన్నత పాఠశాలల్లో నిర్వహించనున్నట్లు జిల్లా జూడో సంఘం కార్యదర్శి భాస్కర్ నాయుడు తెలిపారు. క్రీడాకారులు తమ ఆధార్ కార్డులతో ఉదయం 11 గంటలకు హాజరుకావాలని సూచించారు.