NTR: మైలవరం లోని విటిపియస్ లో జరిగిన నిర్లక్ష్యంతో మహిళా కార్మికురాలు హేమలతకు ఎడమ చేతికి నిన్న తీవ్రమైన గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర చికిత్స అందించకుండా తూతూమంత్రంగా సమీప హాస్పిటల్కు తరలించారు. ఇలాంటి ప్రమాదాలు వరుసగా జరుగుతున్న సంస్థ భద్రతా చర్యలు చేపట్టడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.