‘అఖండ 2’ రిలీజ్ వాయిదా పడటంపై టాలీవుడ్ బడా నిర్మాత విశ్వప్రసాద్ టీజీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘అఖండ 2’ వాయిదా వేయడం తనను తీవ్రంగా కలవరపెట్టిందన్నారు. భవిష్యత్లో మరోసారి ఇలా థర్డ్ పార్టీలు(ఫైనాన్స్) చేసే చివరి నిమిషం అంతరాయాలను నివారించడానికి చట్టపరమైన మార్గదర్శకాలను రూపొందించాలన్నారు. అన్ని సమస్యలు అభిగమించి అఖండ 2 రిలీజ్ కావాలని ఎదురుచూస్తున్నామని ట్వీట్ చేశారు.