VZM: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు వచ్చే ధరఖాస్తులకు వీలైనంత వేగంగా అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. గడువు కోసం చూడకుండా, వచ్చిన దరఖాస్తులు వెంటనే పరిశీలించి అనుమతించాలని సూచించారు. దరఖాస్తులు ఏశాఖ వద్ద పెండింగ్ ఉందో తెలుసుకొని, ఆ శాఖతో మాట్లాడి అనుమతి మంజూరు చేసే విధంగా చూడాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు.