గోవా అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కేంద్రం పరిహారం ప్రకటించింది. మృతి చెందిన 23 మందికి రూ.2 లక్షలు.. గాయపడినవారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అర్పోరాలోని బిర్చ్ నైట్‌క్లబ్‌లో అర్ధరాత్రి సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం సంభంవించింది. మరణించినవారిలో నలుగురు పర్యాటకులు కాగా మిగిలినవారు నైట్‌క్లబ్ సిబ్బందిగా తెలుస్తోంది.