KMM: కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి జాటోత్ జాయ్ లూసి నాలుగోసారి బరిలో నిలిచారు. గతంలో 2004, 2014లలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ఆమె, 2019లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు దఫాలుగా సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం ఉన్న లూసి, ఈసారి కూడా మరోసారి విజయం సాధించాలని ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు.