WGL: సంగెం మండలంలో పెద్ద తండా, గాంధీ నగర్ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. పెద్ద తండాలో గూగులోతు వినోద నామినేషన్ వేయకుండానే సర్పంచ్, వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే గాంధీనగర్లో పలువురు విత్డ్రా చేసుకోవడంతో కోడూరి శ్రీనివాస రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇద్దరూ కాంగ్రెస్ నేతలే కావడం విశేషం. మండలంలో ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగుతోంది.