ఒక్క ఉదయం వ్యాయామం చేస్తే, ఒక్కపూట పండు తింటే, ఒక్క రాత్రి త్వరగా నిద్రపోతే మనలో ఎలాంటి మార్పులు కనపడకపోవచ్చు. కానీ, వెయ్యి రోజులు వరుసగా వ్యాయామం చేయడం, పండ్లు తినడం, త్వరగా నిద్రపోవడం చేస్తే, దాని ప్రభావం అనూహ్య స్థాయిలో ఉంటుంది. స్థిరత్వంతో ప్రయత్నాలు కొనసాగించినప్పుడే పదింతలు ఫలితాలు వస్తాయి.