SKLM: గోపినాధపురం హుద్‌హుద్ కాలనీలో నివసించే 10 నెలల ఏ. అభిషేక్ శనివారం తీవ్ర అస్వస్థతతో మరణించాడు. పుట్టుకతో థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న చిన్నారి రెండు రోజులుగా పరిస్థితి దిగజారడంతో తల్లిదండ్రులు టెక్కలిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి సూచనలపై శ్రీకాకుళం తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు.