MBNR: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మొదటి రెండవ మూడవ ఎన్నికల ప్రక్రియ పూర్తయి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. శనివారం కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన వారిపై ఎన్నికలకు దూరమయ్యేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఏకగ్రీవమైన పంచాయతీల్లో కూడా కోడ్ అమలులో ఉంటుందన్నారు.