ప్రకాశం: బంగారు షాపుల వద్ద నకిలీ ఆభరణాలతో మాయమాటలు చెప్పి మోసానికి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు చీమకుర్తి సీఐ ప్రసాద్ తెలిపారు. చీమకుర్తికి చెందిన ఓ బంగారు దుకాణం వద్దకు నెల్లూరు జిల్లా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి రోల్డ్ గోల్డ్ బ్రాస్లెట్ అందించి మోసానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. సీసీ కెమెరా సాయంతో అతనిని అరెస్ట్ చేశారు.