NRPT: నారాయణపేట మండలం బొమ్మన్ పాడులో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని శనివారం సాయంత్రం పట్టుకున్నట్లు రూరల్ ఎస్సై రాముడు తెలిపారు. బాలప్ప ఇంట్లో దాడి చేసి, మొత్తం 10.17 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.