దేశవ్యాప్తంగా ఇవాళ న్యాయవిద్య విశ్వవిద్యాలయాల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి క్లాట్-2026 జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. HYDలోని నల్సార్ వర్సిటీ, విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా వర్సిటీలో సీట్లను కూడా ఈ పరీక్ష ర్యాంకర్లతో భర్తీ చేస్తారు. మొత్తంగా సుమారు 4,500 యూజీ, పీజీ సీట్లు ఉన్నాయి.