VSP: జీవీఎంసీ స్థాయి సంఘం సమావేశంలో పలు అభివృద్ధి పనులకు సభ్యులు ఆమోదం తెలిపారు. శనివారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశాన్ని మేయర్ , స్థాయి సంఘం ఛైర్పర్సన్ పీలా శ్రీనివాసరావు నిర్వహించారు. మొత్తం 287 అంశాలు అజెండాగా పెట్టగా, సభ్యులు క్షుణ్ణంగా చర్చించిన అనంతరం ప్రధాన అజెండాలోని 34 అంశాలను వాయిదా వేశారు.