సౌతాఫ్రికాతో మూడో వన్డేలో సెంచరీతో అదరగొట్టిన టీమిండియా యువ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ టీమిండియా ఎలైట్ లిస్టులో స్థానం దక్కించుకున్నాడు. భారత్ తరఫున 3 ఫార్మాట్లలో(Test, ODI, T20I)నూ సెంచరీ బాదిన 6వ ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ సురేష్ రైనా కాగా, అతని తర్వాత రోహిత్ శర్మ, KL రాహుల్, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ ఈ లిస్టులో చేరారు.