PPM: కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరీ శనివారం జీయ్యమ్మవలస మండల నాయకులు, కార్యకర్తలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు ఆవగాహన కల్పించాలని సూచించారు. మండల, గ్రామ నాయకులు పరస్పర సమన్వయంతో పనిచేసి, సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలన్నారు.