ఖమ్మం జిల్లాలోని మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 7 మండలాల్లో దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియను శనివారం అధికారులు పూర్తి చేశారు. ఇందులో సర్పంచ్ 906, వార్డుల స్థానాలకు దాఖలైన 4010 నామినేషన్లను ఆమోదించినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈనెల 9వ తేదీ మధ్యాహ్నం 3 లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, అభ్యర్థులు గమనించాలని పేర్కొన్నారు.