KRNL: రైతుల ప్రయోజనాలకు భంగం కలగకుండా మొక్కజొన్నను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటా రూ. 2,400 తగ్గకుండా కొనుగోలు చేయాలని కలెక్టర్ డా. ఏ.సిరి ట్రేడర్లను ఆదేశించారు. కలెక్టరేట్లో ట్రేడర్లతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తూకాలలో లోపాలు, మోసాలు జరగకుండా పరిశీలనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.