కెనడాలో భారీ భూకంపం సంభవించింది. కెనడియన్ టెరిటరీ యుకోన్-US అలస్కా బోర్డర్లో సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.0 తీవ్రతగా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. లోకల్ టైమ్ 11:41AM తర్వాత దాదాపు 20 సార్లు భూప్రకంపనలు వచ్చాయి. బోర్డర్ ప్రాంతం కావడంతో ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.