MDK: అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హవేలిఘనపూర్ మండలం జక్కన్నపేటలో ఇవాళ చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇమ్మడి నర్సింలు(45) ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని భార్య పద్మ ఫిర్యాదు మేరకు హవేలిఘనపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పుల బాధతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.