బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, బొప్పాయి కూడా కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. పచ్చి బొప్పాయి లేదా బొప్పాయి పండును మోతాదుకు మించి ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. పచ్చి బొప్పాయిలో ఉండే పపైన్, లాటెక్స్ అన్నవాహికను, జీర్ణాశయాన్ని చికాకుపరిచే అవకాశం ఉంది. దీనివల్ల కడుపులో గ్యాస్, ఉబ్బరం, అజీర్తి వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.