TG: ఇండియన్ నేవీ డే ఉత్సవాల్లో భాగంగా NAVY సాగర శక్తిని చాటిచెప్పే సంగీత విభావరి హైదరాబాద్లో జరగనుంది. తూర్పు నౌకాదళ కమాండ్ (విశాఖపట్నం) నుంచి వచ్చిన 26 మంది సభ్యుల నేవీ బ్యాండ్.. రేపు సాయంత్రం 6 గంటలకు కొండాపూర్లోని సరత్ సిటీ మాల్లో గంటపాటు సంగీత ప్రదర్శన ఇవ్వనుంది. 1971 యుద్ధ విజయస్ఫూర్తిని గుర్తుచేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ ఆహ్వానితులే.