GNTR: గుంటూరు జిల్లాలో 75 రోజుల్లో 163 మందిని గుర్తించి, 28 కేసులు నమోదు చేసి, 127 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. 48 కేజీల గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు. టాస్క్ ఫోర్స్, డ్రోన్ గస్తీలతో గంజాయి కార్యకలాపాలను అరికడుతున్నారు. పలు యూనివర్సిటీల్లో సంకల్పం పేరుతో మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించామన్నారు.