HYD: గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త చరిత్రకు తెర లేపనుంది. 2047 నాటికి హైదరాబాద్ సిటీ GDPని రూ. 600 బిలియన్లకు చేర్చాలనే ప్రభుత్వ సంకల్పం ప్రపంచం ముందుంచనుంది. ఈ నేపథ్యంలో లక్ష్యసాధన కోసం పినకల్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, ఇన్నోవేషన్ సెంటర్‌గా నగరాన్ని తీర్చిదిద్దే కీలక వ్యూహాలను రూపొందించారు.