GNTR: జిల్లాలో ఇసుక సరఫరా సజావుగా సాగాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. ఇసుక కమిటీతో సమావేశమైన ఆమె.. మైనింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. ఎన్వోసీ ఉన్న చోట మాత్రమే నిబంధనల ప్రకారం తవ్వకాలు జరపాలని స్పష్టం చేశారు. వాహనాల్లో పరిమితికి మించి లోడ్ వేయకూడదని, ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలని అధికారులకు సూచించారు.