TG: కామారెడ్డి జిల్లాలో చిరుతపులి సంచారం ప్రజలకు భయాందోళన కలిగిస్తోంది. కామారెడ్డి – ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై అటవీ ప్రాంతం వద్ద రోడ్డుపై చిరుత సంచరించడం తాజాగా కలకలం రేపింది. ఆ మార్గంలో వెళ్తున్న ఆర్టీసీ బస్సు కొట్టాల్ వద్దకు రాగా.. రోడ్డు దాటుతున్న చిరుతపులిని డ్రైవర్ గమనించారు. అక్కడే బస్సును నిలిపివేయడంతో.. ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు.