ఖమ్మం: ఆకర్షణీయమైన ప్రకటనలతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” పేరుతో నిర్వహిస్తున్న సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. మోసపురిత ఆఫర్లను ప్రజలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.