ELR: ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు తత్కాల్ విధానంలో దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 2 నుంచి 6 వరకు అవకాశం కల్పించినట్లు డీఈవో వెంకట లక్ష్మమ్మ తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. అభ్యర్థులు రూ.600 అదనపు రుసుము చెల్లించి అడ్మిషన్ పొందవచ్చన్నారు. ముఖ్యంగా పాత సిలబస్లో పదో తరగతి ఫెయిల్ అయిన వారికి ఇది మంచి అవకాశమని తెలిపారు.