MDK: జిల్లాలో రేపటి నుంచి నర్సాపూర్, చిలిపిచెడు, కౌడిపల్లి, కొల్చారం, శివంపేట్, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో నామినేషన్ స్వీకరణకు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మూడో విడత నామినేషన్ ఏర్పాట్లను కొల్చారం ఎంపీడీవో కార్యాలయంలో పరిశీలించారు. 7 మండలాల్లో 183 సర్పంచ్, 1528 వార్డులకు నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.