MDK: మెదక్ పోలీస్ కార్యాలయంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్ పాల్గొని సైబర్ నేరాలతో సంబంధమైన వివిధ ప్రమాదాలపై అవగాహన పొందారు. అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు, ప్రిన్సిపల్ పాల్గొన్నారు.