HYD: తమ అభివృద్ధి మాటల్లో కాదు చేతుల్లో ఉంటుందని యాకుత్పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ అన్నారు. మంగళవారం కుర్మగూడ డివిజన్లో ఆయన పర్యటించారు. మాదన్నపేట్, ఆయేషా నిస్వాన్ స్కూల్ వద్ద రోడ్డు పనులను పరిశీలించారు. రూ. 1.57 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.